YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈవీఎంలకు పార్లమెంటు అనుమతి కూడా లేదు చెన్నైలో మీడియాతో చంద్రబాబు

 ఈవీఎంలకు పార్లమెంటు అనుమతి కూడా లేదు  చెన్నైలో మీడియాతో చంద్రబాబు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తమిళం అందమైన భాష.  పొరుగు రాష్ట్రం తమిళనాడు ఓటర్లను కలుసుకోవడం ఆనందంగా ఉంది. మోడీ దేశానికి చాలా నష్టం చేశారు. నేను అంబేద్కర్ చెప్పిన మాటలను కోట్ చేస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజలకు ఈ హక్కును ఎవరూ కాదనలేరు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. ప్రపంచంలో ఐదు, పది దేశాలలో మాత్రమే ఈవీఎంలు వాడుతున్నారు. ఏపీ, తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికలలో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జర్మనీ లాంటి సాంకేతికంగా ఉన్నత దేశం కూడా ఈవీఎంలను పక్కనపెట్టింది. నెదర్లాండ్స్, ఐర్లండ్ లో కూడా బ్యాలట్ వైపే వెళుతున్నారు- ఈవీఎంలలో ట్యాంపరింగ్, మేనిప్యులేషన్, మిషన్లను ఆల్టర్ చేయడం వంటి సమస్యలు వస్తాయని అయన అన్నారు. 
నిన్న సీఈసీ కూడా ఈవీఎంలను మాల్ ఫంక్షనింగ్ చేయచ్చని చెప్పారు. ఇలాంటి ఈవీఎంలను ఎలా నమ్మగలం. దీనిపై ఆడిట్ ఎవరు చేస్తున్నారు. దీనిపై ఎలాంటి రిజల్యూషన్ లేదు. పార్లమెంటు అనుమతి కూడా లేదని అన్నారు. 1995 నుంచి సాంకేతికతను అత్యధికంగా ఉపయోగించిన సీఎంని నేనే. సింగపూర్ తో సహా ఏ అభివృద్ధి చెందిన దేశం కూడా ఈవీఎంలు వాడడం లేదు. తెలంగాణలో ఫారం 7 ఉపయోగించి 25 లక్షల ఓట్లను తొలగించారు. దొంగ ఐపీ అడ్రస్ లతో వీటిని చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఈసీ సారీ చెప్పి చేతులు దులిపేసుకుంది.  ఏపీలో అక్కడున్న ప్రతిపక్షం 7 లక్షల ఓట్లను తొలగించాలని చూసింది. దాన్ని మేం అడ్డుకున్నామని అయన అన్నారు.

Related Posts