నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరోసిస్ బాధితులు చాలా మంది ఉన్నారని, వీరి సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడి తప్పనిసరిగా న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కె.లక్ష్మన్ తెలిపారు.ఫ్లోరోసిస్ బాధితుల తరఫున ఎన్.ఆర్.ఐ.లు జలగం సుధీర్, రమేష్ దేవా, కత్తి గోపాల క్రిష్ణ, బోజా రెడ్డి (ప్రకాశం), జి. నాగరాజు తదితరులు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కె.లక్ష్మన్‌ను నేడు హైదరాబాద్‌లో కలిశారు.కేంద్ర ప్రభుత్వం చౌటుప్పల్ దగ్గర ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసిందని, భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు చొరవ చూపాలని కోరారు. ఫ్లోరోసిస్ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని లక్ష్మన్ తెలిపారు.