YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట....

రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట....
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లె వద్ద రైలు కిందపడి ఓప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడు చంద్రగిరి మండలం, మొరవపల్లెకు చెందిన ధనంజయలు(19),గా గుర్తించారు. ప్రియురాలు శ్రీకాళహస్తి చెందిన పల్లవిగా రైల్వే పోలీసులు గుర్తించారు. పల్లవి(16) శ్రీకాళహస్తిలో విక్రమ్ జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల 12వ తేది ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఈఫలితాల్లో పల్లవి ఫెయిల్ అయ్యింది.  చదువుకుంటుండగా ధనంజయలకు, పల్లవికి సోషల్ మీడియా ద్వారా ఏర్పడి పరిచయం ప్రేమగా మారింది. ఈనేపధ్యంలో ఈనె 12వ తేది నుంచి పల్లవి కనిపించలేదు. దీంతో పల్లవి తల్లిదండ్రులు రవి, సుమతిలు తన కుమార్తె ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అవ్వడంతో దానిని అవమానంగా భావించి కనిపించడం లేదని శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మొరవపల్లె వద్ద రైలుకింద పడి ధనంజయలు, పల్లవిలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు రెండు రోజుల క్రితం ఓదేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసు విచారిస్తున్నారు. ప్రేమికులు ఇద్దరూ మైనర్లు కావడం, ప్రియురాలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

Related Posts