యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పుంజుకుంది. ప్లేఆఫ్ రేసులో వెనుకబడుతున్న దశలో కీలక విజయం సాధించింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో అశ్విన్ సేన 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేసింది. రాహుల్ త్రిపాఠి (50; 45 బంతుల్లో 4×4) టాప్‌స్కోరర్. రవిచంద్రన్ అశ్విన్ (2/24), మురుగన్ అశ్విన్ (1/24) ప్రత్యర్థికి కళ్లెం వేశారు. అంతకుముందు పంజాబ్ 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (52; 47 బంతుల్లో 3×4, 2×6), డేవిడ్ మిల్లర్ (40; 27 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఆఖర్లో అశ్విన్ (17 నాటౌట్; 4 బంతుల్లో 1×4, 2×6) మెరుపులే ఇరు జట్ల మధ్య తేడాగా నిలవడం గమనార్హం. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ఏర్పాట్లలో తెలివిగా వ్యవహరించి కెప్టెన్‌గానూ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌నే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.