యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గవర్నర్ కి వినతిపత్రాలిచ్చి జగన్ కొత్త డ్రామాల కు తెర లేపాడు. ఎన్నికల వేళ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలో అన్ని చేశాడని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. మేము ఎక్కడికీ పోం. నువ్వే చంచలగూడ జైలుకు పోతావు. ఓటు వేసిన వెంటనే లోటస్ పాండ్ లో తేలావంటే పక్క రాష్ట్రం అంటే ఎంత ప్రేమో అర్దం అవుతుందని అన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇచ్చామన్నావు పేర్లు బయటపెట్టే దమ్ముందా. లోటస్ పాండ్ లో కూర్చొని రాజకీయాలు చేస్తావా అని ప్రశ్నించారు. 11వ తారీకు సాయంత్రం నీ ప్రెస్ మీట్ లో నీ ఓటమిని అంగీకరించావు. ఈ రోజు బిజేపి సహకారంతో మళ్ళీ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు. మహిళలలకు ధన్యవాదాలు. చంద్రబాబు పిలుపుకు మహిళలు స్పందించి అర్దరాత్రి వరకు ఓటు వేశారు. నా నియోజకవర్గంలో 44 బూతులు పనిచేయలేదు. సాంకేతిక నిపుణులు హరిప్రసాద్ ప్రశ్నిస్తే కేసులున్నాయంటారా. జగన్ ప్రశ్నిస్తే వెంటనే ఆ అధికారి ట్రాన్సఫర్ అవుతారా. రిటైడ్ సంఘాలు ఎమిచేస్తున్నాయి. మా పై బురద జల్లుతారా. ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీసారు. హైదరాబాద్ భూభాగంలో ఉండి కుతంత్రాలు పన్నుతారా. దుర్మార్గుడికి వత్తాసు పలుకుతారా. పోలవరం విషయంవో కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఎందుకు స్పందించడంలేదు. దూకుడు సినిమాలోని బ్రహ్మానందం రియాలిటీషో లోటస్ పాండ్లో కనబడుతుందని అయన అన్నారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. జగన్ కి ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టుకుంది. ఈ ఆర్దిక నేరగాడి చూట్టూ మరికొందరు ఆర్దిక నేరగాళ్ళు చేరి పదవి పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. అభివృద్దికి ఓటువేశామని ప్రజలందరూ నిర్బయంగా చెబుతున్నారు. ప్రజలు ఒంటిగంట వరకు ఓటు వేస్తారని బీహారీ ప్రశాంత్ కిషోర్ , జగన్ లు కలలో కూడా ఊహించలేదు. ఈవియంలు పనిచేయనీయకుండా చేస్తే ఓటింగ్ శాతం తగ్గిస్తే విజయం సాదించవచ్చనుకున్నారు. పగ, ఈర్షతో జగన్ రగిలి పోతున్నారు. తండ్రి పదవిని అడ్డంపెట్టుకుని అధికారులను జైలుకు పంపించావు. నీ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలు చేశావో గుర్తు చేసుకో అని అన్నారు. మే 23 ప్రజలు ఇచ్చే తీర్పుకు నీవు ఆరోగ్యంగా , మానసికంగా సంసిగ్దమైతే మంచిది. నీ మైండ్ గేమ్ ఈ సారి పనిచేయదు. 50 శాతం వివి ప్యాడ్ లు లెక్కపెట్టాల్సిందే . అంబేద్కర్ చెప్పిన విధంగా రాజ్యాంగం విలువలు కాపాడాల్సిందేనని అయన అన్నారు.