యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీమంత్రి దేవినేని నెహ్రూ 2వ వర్ధంతి సందర్భంగా ఎన్ఏసీ మండపంలో సంతాప సభ జరిగింది. నెహ్రు విగ్రహానికి పూల మాల వేసి మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీలు బుద్ధ వెంకన్న, బచ్చుల అర్జునుడు,గద్దె రామ్మోహన్, కడియల బుచ్చిబాబు, దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ నెహ్రు స్ఫూర్తిని గుడివాడ లో ఆయన అనుచరులు కొనసాగించారు. గుడివాడ లో అవినాష్ ని ప్రత్యర్థి ఎంత రెచ్చకొట్టిన శాంతియుతంగా వ్యవహరించారు. గుడివాడ లో అవినాష్ గెలుపు ఖాయం. జిల్లా రాజకీయాల్లో నెహ్రు కి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. దేవినేని వంశం 1983 నుంచి అసెంబ్లీలో ఉంది.ఈ సారి తనతో పాటు అవినాష్ కూడా అసెంబ్లీలో కి రాబోతున్నాడు. మోడీ, జగన్, కేసీఆర్ లు ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు. దొంగే దొంగ దొంగ అని అరిసినట్లు ఉంది జగన్ తీరని విమర్శించారు. చంద్రబాబు పై ప్రజలకు ఉన్న నమ్మకమే టీడీపీ ని మరోసారి అధికారం లోకి తీసుకు రాబోతుందని అయన అన్నారు.