యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశంలోని ఇరవై మూడు రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్లు ద్వారా భవిష్యత్తులో ఎన్నికలు జరపాలని కోరుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి వీవీప్యాట్ రశీదులను లెక్కించాలని కోరుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం మొండిగా, నిరంకుశంగా తిరస్కరించడం దురదృష్టకరమని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. బుధవారం అయన వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో 191 దేశాలుండగా అందులో 173 దేశాల్లో బాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో అమెరికా, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయని అయన అన్నారు. కొన్ని దేశాలు కొన్నాళ్లు ఈవీఎంలు వాడి లోపాలు ఉన్నాయని గ్రహించి తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. వీవీప్యాట్ రశీదులు లెక్కించనప్పుడు వాటిని ఎందుకు ప్రవేశపెట్టినట్లు అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి, వైకాపా పార్టీలు తందానా .అని వంతపాడటం శోచనీయమని అన్నారు.