YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ గురువారం శ్రీ సీతారాముల కల్యాణాన్ని రాత్రి 8 నుండి 10 గంటల వరకు వైభవంగా నిర్వహించేందుకు టిటిడి, జిల్లా యంత్రాంగంతో    కలిసి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా భక్తుల కోసం కల్యాణవేదిక వద్ద గ్యాలరీలు ఏర్పాట్లు చేసారు. 
శ్రీ సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం కల్యాణవేదిక వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆకట్టుకునేలా వేదిక ముఖద్వారాన్ని రూపొందించారు. మొత్తం మూడు ద్వారాలుండగా, మధ్య ద్వారాన్ని శ్రీ సీతారాముల ఉత్సవర్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించేందుకు కేటాయించారు. రెండు చివర్ల ఉన్న ద్వారాల వద్ద భక్తులను అనుమతిస్తారు.  జర్మన్ షెడ్లు దాదాపు లక్ష మంది భక్తులు పండువెన్నెలలో కూర్చుని కల్యాణాన్ని తిలకించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టంగా జర్మన్ షెడ్లు, భక్తలు కుర్చునేందుకు వీలుగా కార్పెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా  ప్రముఖులు కూర్చునేందుకు కల్యాణవేదిక పక్కన వేదిక రూపొందించారు. వ్యక్తులను నిలువరించేందుకు వీలుగా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. 

Related Posts