యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నోట్ల రద్దు చర్య తర్వాత దేశవ్యాప్తంగా సుమారు50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ) తన రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టేయినబుల్ ఎంప్లాయిమెంట్(సీఎస్ఈ) ఈ నివేదికను ప్రచురించింది. యునిట్ లెవల్ డేటా ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. నవంబర్8,2016లో మోదీ సర్కార్ పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల వల్ల సుమారు 50 సంఖ్య పెరుగుతున్నదనిమరో వైపు ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, డిమానిటైజేషన్ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిందని రిపోర్ట్ రాసిన అమిత్ బోస్‌లే తెలిపారు.