YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

2019 ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ టీమ్ ప్రకటన..!

2019  ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ టీమ్ ప్రకటన..!
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ను గెలవలేదు. ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం.. టోర్నీలో చతికిలపడటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్కి బాధ్యతలు ఇవ్వడంతో అభిమానుల ఆశలు పెరిగాయి. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలు కానుంది. ఈరోజు 15 మందితో కూడిన జట్టుని ప్రకటించారు. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న బట్లర్, బెయిర్స్టోకి ఛాన్స్ దక్కింది. వికెట్ కీపర్గా జోస్ బట్లర్ని ఎంపిక చేశారు. 
తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి ఆడుతున్న బట్లర్.. అసాధారణ ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్న ఓపెనర్ జానీ బెయిర్స్టోకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. అతను ఐపీఎల్లో ఇప్పటికే శతకం సాధించి మంచి జోరుమీదున్నాడు.  ఇంగ్లాండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), టామ్ కరన్, జో డెన్లీ, అలెక్స్ హేల్స్, ఫ్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్స్టోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్వోక్స్, మార్క్వుడ్  క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ను గెలవలేదు. ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం.. టోర్నీలో చతికిలపడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. గత రెండేళ్లుగా ఆ జట్టు వన్డేల్లో అసాధారణంగా ఆడుతోంది. ఎంతలా అంటే.. ఈ మధ్యకాలంలో ఆ జట్టు మూడు సార్లు వన్డేల్లో 400పైచిలుకు స్కోరు చేసింది. క్రికెట్ ప్రపంచంలో ఈ తరహాలో ఏ జట్టు కూడా వన్దేల్లో ఆధిపత్యం చెలాయించలేదు. దీనికి తోడు స్వదేశంలో ప్రపంచకప్ జరగనుండటంతో.. ఆ జట్టు ఈసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.

Related Posts