YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇసుక తుఫాన్ వణికిస్తోంది

ఇసుక తుఫాన్ వణికిస్తోంది

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫాన్ వణికిస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు, పిడుగుపాటు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే 30 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.గుజరాత్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం (ఏప్రిల్ 16) మధ్యాహ్నం నుంచి అకాల వర్షాలు, పిడుగుల వాన కురుస్తోంది. ఈ కారణంగా ఇప్పటివరకు మధ్యప్రదేశ్లో 16 మంది, గుజరాత్లో 9 మంది మరణించారు. భారీ వర్షాలు, ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్లో ఆరుగురు మృతి చెందారు.రాజస్థాన్లోని అజ్మీర్, చిత్తోర్గఢ్, శ్రీగంగానగర్, కోట, పిలానీ ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి.ఇక గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్, బనస్కాంత, పఠాన్, మెహ్సానా, సబర్కాంత తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ సంభవించింది. మధ్యప్రదేశ్లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.అటు పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం చేస్తోంది. వర్షంతో పాటు పిడుగులు పడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బలమైన ఈదురుగాలులు జన జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ వర్షాలపై ప్రధాని మోదీ స్పందించారు. అకాల వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని సబర్కాంత జిల్లాలో ప్రధాని మోదీ తన పర్యటన రద్దు చేసుకున్నారు. మోదీ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు తుఫాన్ కారణంగా కూలిపోయాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి.

Related Posts