రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ నుంచి లంచం తీసుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలానికి చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పరింపూడి రెవెన్యూ గ్రామ వీఆర్వో అడపా రాంబాబు తన పరిధిలోని 30 సెంట్ల భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి యూనియన్ బ్యాంకు మాజీ మేనేజర్ శ్రావణ్‌కుమార్‌ను 30 వేలు డిమాండ్ చేశాడు. తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్ తనకు ఆన్లైన్లో మంజూరైన పాస్ పుస్తకాలను వీఆర్వో ఇవ్వకుండా లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఏసీబీను ఆశ్రయించారు.దీంతో వీఆర్వో కార్యాలయానికి శ్రావణ్‌ను 30 వేలు ఇచ్చి పంపగా సొమ్మును వీఆర్వో రాంబాబుకు అందిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.