YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు

 ఆర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికలు లోపభూయిస్టంగా జరిగి ఈవిఎంలు టాంపరింగ్ జరిగితే చంద్రబాబుకు 150 సీట్లు ఎలా వస్తాయి. ఎందుకు ఈ విధంగా బెంబేలు పడి ఢిల్లీ వెళ్లి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. బహుశా చంద్రబాబు ఓడిపోయే సమయంలో అధికారం చేజారిపోతుంది అన్నప్పుడు ఆయన పరిస్దితి ఇలానే ఉంటుందని అనుకుంటున్నానని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. ఎట్టిపరిస్దితులలోను రేపు కౌంటింగ్ జరిగే సమయానికి ఓడిపోతారనే భావనలో అర్దం పర్దం లేకుండా మాట్లాడుతున్నారు. -చంద్రబాబు అర్దవంతంగా మాట్లాడితే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా పేరు సార్దకత అవుతుంది. కోడెల పై నిన్న అతికష్టంగా ఓ కేసు రిజిస్టర్ చేశారు. కోడెల శివప్రసాద్ ఇనిమెట్లలో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఆక్రమించుకున్నారు. పోలింగ్ సిబ్బందిని, ఏజంట్లును బెదిరించి బయటకుపంపి  రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారని అయన ఆరోపించారు. దానిపై మేం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే కనీసం కేసు నమోదు చేయలేదు. ఫిర్యాదు ఇస్తే వెంటనే ఎందుకు కేసునమోదు చేయలేదనే అంశంపై సమాధానం చెప్పాల్సిన భాద్యత పోలీసు అధికారులపై  ఉంటుంది. ఫిర్యాదు ఇస్తే విచారణ చేసి నమోదు చేయాలి చట్టబద్దంగా చేయాల్సిన అంశం. రాజుపాలెం ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు ఇస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదు. కోడెల పై కేసు నమోదు చేసేసరికి చాలా ఆవేశంగా చాలా విషయాలు మాట్లాడారు. నిన్న  ప్రెస్ మీట్ లో కోడెల  చాలా అహంకారపూరితంగా మాట్లాడారు. చంద్రబాబుతో జగన్ మోహన్ రెడ్డి పోటీ యే కాదు.నాకు అంబటి రాంబాబుతో పోటీనే లేదు అని అన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం. జగన్  గత ఎన్నికలలో చంద్రబాబు తో పోటి చేసి కేవలం ఐదు లక్షల ఓట్లతేడాతో  ఓటమి చెందారు. 24 ఓట్ల తేడాతో మాత్రమే నాపై గెలిచారు.ఇలా మాట్లాడటం ధర్మమేనా కోడెల అని ప్రశ్నించారు. బలవంతుడ్ని అని విర్రవీగితే…-సుమతి శతకం చూస్తే చలిచీమల చేతచిక్కి బలవంతమైన సర్పం చనిపోయిందంట. అసలు సుమతి శతకం పద్యం నీ కోసమే రాసినట్లుగా ఉంది.  రేపు 23 వతేదీన ఫలితాల అనంతరం మీ సంగతి తెలుస్తుంది.తలఎక్కడ పెట్టుకుంటారో చూసుకోండని అన్నారు. ఇనిమెట్ల గ్రామంలో తనపై దాడి జరిగిందని కోడెల చెప్పుతున్నారు.అక్కడ జరిగింది నీపై దాడి కాదు. రౌడీలతో వెళ్లి ఆ పోలింగ్ బూత్ పై దాడి చేసి ఆక్రమించుకోబోతే ప్రజలు తిరగబడ్డారు. 40 ఏళ్ల రాజకీయజీవితం అంతా కూడా బూత్ క్యాప్చరింగ్,బాంబులు వేయడం, వర్గాలమధ్య తగాదాలు
పెట్టడం కాబట్టి నరసరావుపేట నుంచి పారిపోయి సత్తెనపల్లివచ్చి కొద్ది తేడాతో గట్టున పడ్డావని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎంఎల్ ఏలను 23 మంది ఫిరాయింపు చేస్తే వారిలో నలుగురికి మంత్రులు ఇస్తే దాని ఫిర్యాదుపై ఏం చర్య తీసుకున్నారు. 2014లో నరసరావుపేటలో నల్లబోతు వెంకట్రావును చిత్తుచిత్తుగా ఓడించింది నీవు అని అందరికి తెలుసు. ఇప్పుడు అరవిందబాబు అనే అభ్యర్దిని సైతం ఓడించబోతున్నావు.ఎందుకంటే మీ అబ్బాయి,అమ్మాయి లకు పెత్తనం కావాలి. బ్యాలెట్ ఫలితాలు వస్తే ఎవరు ఏమిటో తేలిపోతుంది.ప్రజలు ఆ రరోజు సమాధానం చెప్పబోతున్నారు. రొంపిచర్లలో ఎన్నికల సందర్భంగా ప్రజలు నీ వెంట పడితే పారిపోయిరాలేదు. 1999లో నీ సొంత ఇంట్లో బాంబులు పేలి కార్యకర్తలు నలుగురు చనిపోయారు. ఇనిమెట్ల గ్రామంలో నీవు దౌర్జన్యం చేయడానికి వెళ్లావు. ఆ గ్రామంలో ఎప్పుడు గొడవలు జరిగిన దాఖలాలు లేవు. చట్టం చట్టం ప్రకారం పనిచేయాలి. పోలీసు అదికారులు కోడెల వల్ల పోస్టింగ్ వచ్చిందని భావనతో ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. మేం ఎస్పీని కలిసిన తర్వాత,మేం నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించిన తర్వాత కేసు నమోదు చేశారు. పోలవరం పై చంద్రబాబు రివ్యూ చేస్తున్నారంట.ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్నా కూడా మీరు  దండుకోవడానికి రివ్యూలు చేయడం ఏంటి?చట్టం ఎలా ఒప్పుకుంటుంది.ఇది 40 ఇయర్స్ ఇండస్ర్టీ గుర్తిస్తే మంచిదని అన్నారు. 

Related Posts