YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మద్దతు ధర ఇచ్చే ధైర్యం లేదు 

Highlights

  • మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు
  •  రైతుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి 
  • కేసీఆర్ డిమాండ్ 
మద్దతు ధర ఇచ్చే ధైర్యం లేదు 

కేంద్ర ప్రభుత్వంపై  తెలంగాణ నుంచి రైతులు పోరు ప్రారంభిస్తారన్నారని ముఖ్యమంత్రి కాల్వతుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు.  ఈ పోరుకు అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన రైతుల సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులకు మద్దతు ధర పెంచే ధైర్యం మోడీకి లేదని మండిపడ్డారు. రైతుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు.
దేశంలో రైతుల దుస్థితికి గత ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలు సరిగా లేవని, కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని నాడు పాలించిన పార్టీలు ఇప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్, బీజేపీని ఉద్దేశించి అన్నారు. గుజరాత్‌లో కూడా పాస్ పుస్తకాల ప్రక్షాళణ సరిగా జరగలేదన్నారు. కర్నాటక ఎన్నికల కోసమే కావేరీ - గోదావరి సంగమం అన్నారు. తమ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తారని చెప్పారు. రైతులు సహనం కోల్పోతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలన్నారు.

Related Posts