YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో వైసీపీ స్వీప్ చేస్తుందా

నెల్లూరులో వైసీపీ స్వీప్ చేస్తుందా
రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లాలో ఈ దఫా వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందా? మొత్తం ఇక్కడి 10 నియోజకవర్గాల్లోనూ 9 చోట్ల వైసీపీ విజయం సాధిస్తుందా? అంటే.. తాజాగా వైసీపీ వెలువరించిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను బట్టి వైసీపీ ఇక్కడ బాగా పుంజుకున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఇక్కడ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోందని అంటున్నారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న విధంగా ప్రభుత్వ పథకాలు, సంక్షేమం వంటివి ప్రజల్లో జోరు పెంచి ఉంటే.. ఇక్కడ ఆ ప్రభావం కనిపించి ఉండాలి. కానీ, ఇప్పుడు వైసీపీ వేసిన అంచనాలను పరిశీలిస్తే.. మాత్రం ఆ తరహా వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. అదేసమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన రిటర్న్‌ గిఫ్ట్‌ స్టేట్‌మెంట్స్‌ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ప్రాధాన్యం అమాంతం పెరిగింది.ప్రతి ఒక్కరినీ పోలింగ్‌ బూతు వైపు నడిపించింది. ఫలితంగా విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో పోలింగ్‌ శాతం అమాంతం 80 శాతానికి పెరిగింది. దీంతో ఏ పార్టీ విజయం సాదిస్తుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. తాజాగా వైసీపీ తన అంచనాలు వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహం ప్రకారం రాష్ట్రంలో 130 పైగా సీట్లను తాము గెలుచుకుం టామని వెల్లడించి సంచలనం సృష్టించారు. అదేసమయంలో వైసీపీ వెల్లడించిన ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ హవా జోరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని 10 స్థానాల్లోనూ వైసీపీ కనీసం 9 చోట్ల విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ఒకే ఒక్కచోట మాత్రం టీడీపీ విజయం సాధిస్తుందని వైసీపీ లెక్కలు గట్టింది.నియోజకవర్గాల వారీగా చూస్తే.. నెల్లూరు సిటీ, రూరల్‌, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, కావలి, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాలో వైసీపీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అదేసమయంలో ఒక్క గూడురులో మాత్రం టీడీపీ విజయం సాధిస్తుందని వైసీపీ అంచనాలు వేసింది. ఇక, వెంకటగిరి, నెల్లూరు రూరల్‌, సిటీ, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ వర్సెస్‌ టీడీపీ మధ్య హోరా హోరీ పోరు సాగుతుందని చెబుతున్నారు. ఏదేమైనా.. వైసీపీ ఇక్కడ పుంజుకుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. అదేసమయంలో టీడీపీ పూర్తిగా డీలాపడిందని వైసీపీ అంచనా.కానీ, ఎన్నికలకు ముందున్న పరిస్థితిని అంచనా వేస్తే.. ఇక్కడ టీడీపీలో బలమైన నాయకగణం ప్రజల్లో విస్తృతంగా పనిచేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి వైసీపీ పుంజుకునే పరిస్థితి లేదని ఎన్నికలకు ముందు మేధావులు సైతం అంచనా వేశారు. కానీ, ఎన్నికల అనంతర పరిస్థితి మాత్రం తమకు అనుకూలంగా ఉందని వైసీపీ చెబుతోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ టీడీపీ కేవ‌లం మూడు సీట్ల‌తో మాత్ర‌మే స‌రిపెట్టుకుంది. ఆ మూడు చోట్లా స్వ‌ల్ప మెజార్టీతో మాత్ర‌మే గెలిచింది. ఐదేళ్ల‌లో పార్టీ అధికారంలో ఉన్నా ఇక్క‌డ టీడీపీ నాయ‌కుల తీరుతో కేడ‌ర్, ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. ఏదేమైనా వైసీపీ లెక్క‌లు ఎలా ? ఉన్నా వాస్తవ ఫలితం ఎలా ఉంటుంది? నెల్లూరు రాజెవరు? అనే లెక్కల కోసం వెయిట్‌ చేయాల్సిందే.

Related Posts