YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండో విడత పోలింగ్ ప్రారంభం

 రెండో విడత పోలింగ్ ప్రారంభం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గురువారం నాడు దేశ వ్యాప్తంగా రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 96 నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.  18 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు- 38, కర్ణాటక- 14, మహారాష్ట్ర-10, ఉత్తరప్రదేశ్- 8, అసోం- 5, బిహార్- 5, ఒడిశా- 5, చత్తీస్గఢ్- 3, ప.బెంగాల్- 3 జమ్మూకశ్మీర్- 2, మణిపూర్, పుదుచ్చేరి, త్రిపురలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరుగుతోంది. వీటిలో ఎస్సీ 19, ఎస్టీ 03, జనరల్ కేటగిరి 73 స్థానాలున్నాయి. 95 స్థానాల్లో 1,644 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది. ఉత్సవాల కారణంగా మదురైలో రాత్రి 8వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల కారణంగా తమిళనాడులో సినిమా థియేటర్లు బంద్ చేశారు. వెలూరు స్థానంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో అక్కడ పోలింగ్ ప్రక్రియను నిలిపివేసింది.  తిరిగి ఎప్పుడూ నిర్వహించేది ప్రకటించాల్సిఉంది. త్రిపుర ఈస్ట్ లోక్సభ స్థానంలో కూడా నేడు జరగాల్సిన ఎన్నికను ఇసి వాయిదా వేసింది. కాగా   ఓడిషాలో పోలింగ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టు హింసాకాండకు దిగారు.  అ ఘటనలో ఒక మహిళా పోలింగ్ ఏజెంట్ మృతి చెందారు. 

Related Posts