యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రజా సమస్యలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంఛార్జ్ కమీషనర్ ని కలసి వినతిపత్రం అందించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పథకాల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. వెంటనే ఆ పనులన్నీ పూర్తి చేయాలని అయన కోరారు. రూరల్ నియోజకవర్గంలో రోడ్లు త్రవేసి గుంతలమైనాయో, ఎక్కడైతే పనులు ఆగిపోయాయో వాటిని అన్నింటిని వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెలాఖరుకి పూర్తి చేయాలని ఇంఛార్జ్ కమీషనర్ ని కోరారు. ఈ నెల 30లోపు పనులు పూర్తికానట్లయితే మే మొదటి వారం నుంచే రూరల్ నియోజకవర్గ ప్రజలపక్షాన, ఆ సమస్యలఫై పోరుబాట తప్పదని హెచ్చరించారు.