యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బిజెపి జాతీయ అదికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీద జరిగిన అనుచిత దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం . సమాజంలో లో ఇలాంటి సంఘటనలతో కొంతమంది సంచలనం కోసం మరికొంత మంది రాజకీయ ప్రేరణతో దాడులు చేస్తుంటారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. బిజెపి నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఈ రకమైన రాజకీయ కుట్రలు కొంత మంది చేస్తుంటారు. ఇలాంటివి బిజెపిని గాని బిజెపి నాయకులను గాని ఏమీ చేయలేరు. ఈ సంఘటన మీద నిష్పక్షపాతంగా విచారణ జరపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అయన అన్నారు.