YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ప్రపంచ కప్ కు శ్రీ లంక జట్టు

ప్రపంచ కప్ కు శ్రీ లంక జట్టు

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం శ్రీలంక సెలక్టర్లు 15 మందితో కూడిన జట్టుని గురువారం ప్రకటించారు. గత రెండేళ్లలో టీమ్‌ కెప్టెన్‌గా నలుగుర్ని మార్చిన శ్రీలంక మరోసారి.. అనూహ్యంగా ప్రపంచకప్‌లో కెప్టెన్సీ బాధ్యతల్ని దిముత్ కరుణరత్నెకి అప్పగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2015 తర్వాత శ్రీలంక తరఫున కనీసం ఒక్క వన్డే మ్యాచ్‌‌లో కూడా దిముత్ ఆడలేదు. అయినప్పటికీ.. అతడ్ని ప్రపంచకప్‌కి ఎంపిక చేయడమే కాకుండా జట్టు పగ్గాలు కూడా ఇవ్వడం ఇప్పుడ హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచకప్‌కి కెప్టెన్సీ రేసులో ఉన్న దినేశ్ చండిమాల్, ఉపుల్ తరంగాకి కనీసం టీమ్‌లో చోటు కూడా దక్కకపోవగా.. నిరోషన్ డిక్వెల్లా, అఖిల ధనంజయకి సెలక్టర్లు మొండిచేయి చూపారు. అయితే.. ఫిట్‌నెస్‌ సమస్యలో ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న లసిత్ మలింగ టీమ్‌లో చోటు దక్కించుకోగా.. ఆల్‌రౌండర్ తిసార పెరీరా, కుశాల్ పెరీరా, ఏంజిలో మాథ్యూస్‌ జట్టులోకి ఎంపికయ్యారు. శ్రీలంక జట్టు ఇదే: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), లసిత్ మలింగ, ఏంజిలో మాథ్యూస్, తిసార పెరీరా, కుశాల్ పెరీరా, ధనుంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్, ఇసురు ఉదాన, మిలింద సిరివర్ధనె, ఫెర్నాండో, జీవన్ మెండిస్, తిరుమానె, జెఫ్రీ వండర్‌సాయ్, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్ 

Related Posts