యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇండియన్ స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. దీంతో మార్కెట్ నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. చివరకు సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయింది. 39,140 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 11,753 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. నిఫ్టీ 50లో రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, బీపీసీఎల్, విప్రో, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టైటాన్, ఐఓసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఏకంగా 3 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, హిందాల్కో, వేదాంత, ఇండస్ఇండ్ బ్యాంక్, వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 4 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి