Highlights
- ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి
- వైఎస్ జగన్
ఆశ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపాపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జీతాలండేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని చెప్పారు. మంగళవారం ప్రకాశం జిల్లాలోని మార్కపురం నియోజకవర్గం లోని కట్టూరురిపెల్లె లో అయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 99 వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా జగన్ ని కలిసిన ఆశ వర్కర్స్ తమ సమస్యలను విన్నవించుకున్నారు. గత 13 సంవత్సరాల పాటు పని చేసినప్పటికీ, అరకొర జీతాలు ఇస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు.