YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్, మోడీ టార్గెట్ గా ఆర్మూర్ రైతులు

రాహుల్, మోడీ టార్గెట్ గా ఆర్మూర్ రైతులు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిజామాబాద్ రైతులు మరోమారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితను టార్గెట్ చేస్తే, ఈ సారి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని , ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని టార్గెట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించేవరకు ఉద్యమం ఆపమని నిర్ణయం తీసుకున్న రైతన్నలు ఎన్నికలను అస్త్రంగా మలచుకున్నారు. అందుకే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కవిత టార్గెట్ గా పోటీలో రైతులు .. ఇప్పుడు మోడీ, రాహుల్ టార్గెట్ తెలంగాణా రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు రైతులు మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలకు వందల సంఖ్యలో నామినేషన్ వేసి దేశం దృష్టిని ఆకర్షించారు . రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచారు.వీరు చేసిన ఈ పనికి నిజామాబాద్ ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఎలక్షన్ కమిషన్ కు చుక్కలు కనిపించాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు వీరు మరోమారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.మొన్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితను టార్గెట్ గా పెట్టుకుంటే ఈసారి వీరు రెండు జాతీయ పార్టీలకు చెందినటువంటి ప్రధాన నాయకులనే టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మోడీకి పోటీగా వారణాసినుండి , రాహుల్ కు పోటీగా వాయనాడ్ నుండి బరిలోకి దిగనున్న రైతులు నిజామాబాద్ రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు మరియు ఎర్రజొన్న పంటలకు సరైన గిట్టుబాటు ధర రావడంలేదు అని ఆందోళన బాట పట్టారు. రహదారులు నిర్బంధం చేశారు, రోడ్ల పైనే వంట వార్పూ చేశారు. నిరాహార దీక్షలకు దిగారు. ఏం చేసినా ప్రభుత్వాలు దిగి రాకపోవటంతో ఎన్నికల అస్త్రాన్ని ఎంచుకున్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించిన రైతులు 178 మంది రైతులు బరిలోకి దిగారు . నిజామాబాద్ లో పోటీ చేసిన డోస్ సరిపోదని అనుకున్నారో ఏమో ఇప్పుడు ఏకంగా నరేంద్రమోడీ పోటీ చేయబోయే వారణాసి మరియు రాహుల్ గాంధీ పోటీ చేయనున్న వాయనాడ్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మోడీ, రాహుల్ పై పోటీ ద్వారా దేశం దృష్టిని ఆకర్షించే యత్నం .. సమస్య పరిష్కారం కోసం రైతన్నల నిర్ణయం వీరిద్దరూ పోటీ చేసే స్థానాల్లో తాము కూడా పోటీ చేసినట్లయితే వారికున్న సమస్య ఏమిటి అనేది జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అప్పుడు అది అందరి దృష్టిని ఆకర్షించి తమ సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుందేమో అని రైతులు భావిస్తున్నారు .ఏది ఏమైనా సరే వీరు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం హర్షించదగినదే అని ఈ వార్త విన్న వారు అంటున్నారు. రైతుల్లో తమ సమస్య పరిష్కారం కోసం ఈ మాత్రం పోరాట పటిమ ఉండాలని అంటున్నారు. నిజామాబాద్ రైతులను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుని ఉద్యమిస్తే రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని చాలా మంది భావిస్తున్నారు.

Related Posts