YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి

Highlights

  •  తాను నిత్య విద్యార్థిని
  • 40 ఏళ్ల ఒడిదుడుకుల జీవితం
  • సీఎం చంద్రబాబు
 ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి

ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి, దానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఏపీ మైఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ,,40 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులతో ముందుకు సాగానని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభమై 40 ఏళ్లు పూర్తయినట్టు ఓ పత్రికకు చెందిన  గుర్తుచేశారని  చంద్రబాబు చెప్పారు.  ఆర్థిక సంస్కరణల తర్వాతే దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్న బాబు సంస్కరణల గురించి మొదట గట్టిగా మాట్లాడింది తానే అని చెప్పుకొచ్చారు. తాను నిత్య విద్యార్థిని, దావోస్‌కు ఒక్కడినే వెళ్తున్నానన్నారు. మారుతున్న టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకోవాలని, పాత సిద్ధాంతాలనే పట్టుకొని కూర్చుకోవడం సరికాదన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే తన సిద్ధాంతమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అందరూ తెలుసుకోవాలన్నారు. అమెరికాలో అందరూ క్రమశిక్షణగా ఉంటారని, సింగపూర్‌లాంటి దేశాల్లో క్రమశిక్షణ బాగుంటుందని చంద్రబాబు అన్నారు.
జ్యోతిబసును ప్రధానిగా పెట్టాలని ప్రతిపాదించింది తానే అని గుర్తు చేశారు. అయితే ప్రధానిగా ఉండేందుకు జ్యోతిబసు సిద్ధపడినా, వాళ్ల పార్టీ ఒప్పుకోలేదన్నారు. అయితే 20ఏళ్ల తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకున్నారని చెప్పారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు సరిగా ఉండేవి కాదని, ఎన్టీఆర్‌ కాలంలో పెద్ద ప్రాజెక్టులేవీ లేవని అన్నారు. ఎన్టీఆర్‌ మనందరికీ ఓ విజన్‌ నేర్పించారని చంద్రబాబు ఆనాటి స్మృతులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Related Posts