యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నంగునూరుమండలం లోని నాగరాజుపల్లి, సిద్దన్నపేట, నంగునూరు గ్రామంలో గురువారం కురిసిన వడ గండ్ల వర్షానికి దాదాపు నాలుగువందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కాగా శుక్రవారం వ్యవసాయ అధికారి గీత తో పాటు రైతుసమన్వయ సమితి ప్రతినిధులు,రైతుల పొలాలను చూసి పంట నష్టం అంచనవేశారు.నాగారాజుపల్లి లో వరి పంట నష్టం వివరాలను మండల వ్యవసాయ అధికారి గీత , ఏఈఓ శిరీష, సర్పంచ్ పాకాల కల్పన బాబు, రైతు సమన్వయసమితి అద్యక్షులు శంకరయ్య, ఉపసర్పంచ్ జె .మల్లవ్వ కర్ణాకర్, రైతులు జె .చెంద్ర రెడ్డి జె .కిష్టారెడ్డి బిక్షపతి పాల్గొన్నారు.