Highlights
- భారతీయ తత్వశాస్త్రం.
- భారత దేశము :: ఆధునిక యుగము.
గాంధీ పారిశ్రామికీకరణ, యాంత్రీకరణతో దేశంలో చేతి వృత్తులు ధ్వంసమై తీవ్రంగా నిరుద్యోగం ప్రబలుతుందని భావించాడు. భారతదేశంలో యాంత్రీకరణ అనేక రంగాలలో పనిచేస్తున్న ప్రజలను నిరుద్యోగులను చేస్తుందని గాంధీజీ అభిప్రాయం.
బ్రిటిష్ వారు ఇండియాలో ప్రవేశపెట్టిన యాంత్రీకరణను, పారిశ్రామికీకరణను ఆయన సైతాను నాగరికతగా ఆయన వర్ణించాడు.
ఎన్నో చేతి వృత్తులను యాంత్రీకరణ నాశనం చేసిందని, లక్షలాది ప్రజల పొట్టకొట్టి నిరుద్యోగులుగా మార్చిందని ఆయన ఆవేదన చెందాడు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.
ఆధునిక సాంకేతిక ఉత్పత్తులలో ప్రతిదాన్ని ఆయన ఖండించాజని చెప్పలేముకాని, అధిక సంఖ్షాకులను నిరుద్యోగులుగా మార్చే యాంత్రికరణను, భారి పరిశ్రమలనే ఆయన నిరాకరించాడు.
భారత జాతి ఆరు లక్షల గ్రామాలలో నివసిస్తున్నది కనుక గ్రామమే మన ఆర్తిక వ్యవస్థకు ప్రాతిపదిక కావాలి.
ఏ గ్రామానికి ఆ గ్రామం తమ నిత్యావసరాలన్నింటిని ఉత్పత్తి చేసుకొని స్వయం పోషకం కావాలి. స్వయమాధారితం కావాలి. అటువంటి గ్రామ స్వరాజ్యమే దేశ స్వాతంత్ర్య సాధనా లక్ష్యం కావాలని గాంధీ భావించారు.
గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని ఆక్షేపించిన నెహ్రూ. ఆనాడు గాంధీ గ్రామ స్వరాజ్య భావనలను వ్యతిరేకించిన వారిలో నెహ్రూ ఒకరు.
స్వతంత్ర భారత దేశం ప్రపంచంలోని పురోగామి దేశాల సరసన సగౌరవంగా నిలవాలంటే, జాతి దారిద్ర్యం, నిరుద్యోగం తీరాలంటే స్వావలంబనను సాధించాలంటే పారిశ్రామికీకరణ తప్పదని భావించాడు.
పారిశ్రామికీకరణ ఎంత వేగవంతంగా సాధిస్తే అంతగా దేశం పురోగమిస్తుందని నెహ్రూ భావించాడు.
--- బండారు వెంకటేశు.సత్యాన్వేషి, 9440402625