YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

25 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టిన ఎస్పీ, బీఎస్పీ

25 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టిన ఎస్పీ, బీఎస్పీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఇవాళ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకప్పటి బద్ధ శత్రువులు ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి.. ఇవాళ ఒకే వేదికను పంచుకున్నారు. దాదాపు పాతికేళ్ల వైరాన్ని పక్కన పెట్టి దేశ భవిష్యత్‌ కోసం సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు చేతులు కలిపాయి. భారతీయ జనతా పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ఈ పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక ములాయం సింగ్‌ పోటీ చేస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాయావతి, ములాయం పాల్గొన్నారు. ఇక మాయావతికి ఎడమవైపున అఖిలేష్‌ యాదవ్‌, కుడివైపున ములాయం సింగ్‌ కూర్చున్నారు. సభా వేదికపై నుంచి ఈ నేతలు ప్రజలకు అభివాదం చేసిన సమయంలో చప్పట్లు మార్మోగాయి. ఈ సభకు ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌ సింగ్‌ హాజరు కాలేదు.  ములాయం సింగ్‌ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ మాయావతిని గౌరవించాలి. మనకు ఎప్పుడు అవసరం వచ్చినా ఆమె మనకు మద్దతుగా నిలబడ్డారు. కొన్నేళ్ల తర్వాత మాయావతితో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఓటేయమని మాయావతి మిమ్మల్ని కోరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మెయిన్‌పూరి నా కర్మభూమి అని పేర్కొన్నారు. ఎస్పీ - బీఎస్పీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ ముందు నిలబడడం ఇదే చివరిసారి. మరోసారి తనపై మీ గౌరవాన్ని, ప్రేమను చూపించాలని ములాయం కోరారు. దేశ భవిష్యత్‌ కోసం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మెయిన్‌పూరిలో ములాయం సింగ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాలు ములాయం తమ నాయకుడిగా భావిస్తున్నాయి. సమర్థులు, అసమర్థులు ఎవరో గుర్తించి ప్రజలు ఎన్నుకోవాలి. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఆలోచిస్తాయి. వెనుకబడిన వర్గాల కోసం మోదీ చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో మోదీ నాటకాలు, అబద్ధాలు చెల్లవు అని మాయావతి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

Related Posts