యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంసెట్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహణ. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదేవిధంగా మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎంసెట్ ఛైర్మన్ రామలింగరాజు వెల్లడించారు. 23, 24వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వ్యవసాయ, వైద్య విభాగ పరీక్ష జరగనుంది. మొత్తం 2,82,633 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,723 మంది.. వ్యవసాయం, వైద్య విభాగంలో 86,910 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 109 పరీక్షా కేంద్రాలను, హైదరాబాద్‌లో 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రామలింగరాజు తెలిపారు