YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ తెరపైకి జనసేనాని..?

మళ్లీ తెరపైకి జనసేనాని..?

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? ఎన్నికలు ముగియడంతో ఆయన మరోసారి సినీ రంగం వైపు అడుగులు వేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత పరిస్థితి తారుమారవుతోంది. ఎన్నికల ఫలితాలువెలువడటానికి మే 23వ తేదీ వరకూ ఆగాల్సి ఉండడంతో అప్పటి వరకూ తమ కుతూహలాన్ని ఆపుకోలేని పౌరులు ఏం చేయాలో అర్థం కాక చర్చల మీద చర్చలు చేసుకుంటున్నారు. అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తమదంటే తమదంటూ సంబరాలు చేసుకుంటుండగా, జనసేన పార్టీ మాత్రం తమ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో మరో రకమైన చర్చ జరుగుతోంది.అదే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సినీ రంగం వైపు అడుగులు వేస్తున్నారనే వార్త. జనసేనాని త్వరలోనే టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల హడావిడి అయిపోవడంతో ఆయన సినిమాలపై దృష్టి సారించినట్లు సమాచారం. హీరోగా సినిమాలు చేసేందుకు పలువురు నిర్మాతల నుంచి పవన్ కళ్యాణ్ అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీ ఎన్నికల కారణంగా ఆయన సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత వీటి గురించి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారని అప్పట్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి వస్తే... పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉంది.అయితే ఎన్నికల్లో రాజకీయంగా అనుకున్న ఫలితాలు సాధించకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిర్మాతలకు చెల్లించాల్సిన అడ్వాన్స్‌ల కోసమైనా ఆయన సినిమాలు చేయకతప్పని పరిస్థితి నెలకొందని కొందరి వాదన. అయితే రాజకీయాల్లో ఉన్న నటులు సినిమాల్లో నటించకూడదన్న నిబంధన ఏమీ లేదని... ప్రజలకు ఏదో రకంగా దగ్గర ఉండేందుకు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేముందన్నది మరికొందరి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆయన మరోసారి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తరువాత సినీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Related Posts