యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీకాకుళం జిల్లా కేంధ్రంలో భారీ అగ్ని ప్రమాధం సంభవించింది. జి.టి.రోడ్డులోని శ్రీ రాయల్ ఆప్టికల్స్ షాపులో విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాధం జరిగింది. షాపు తెరిచే సమయంలో లోపలి నుంచి దట్టమైన పొగలు రావటాన్ని గమనించిన యాజమాని, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు. చుట్టుప్రక్కల షాపులకు మంటలు విస్తరించకుండా ఫైర్ అధికారులు చర్యలు చేపట్టడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆప్టికల్ షాపులో కళ్లద్దాలు, మిషనరీతో పాటు , కొంతమేర నగదు కాలి బూడిదయ్యింది. సుమారు 10 లక్షల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు..