YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గొగోయ్

 లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గొగోయ్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందనీ... అయితే అది ఎప్పటికీ బలిపశువుగా మారబోదని ఘాటుగా స్పందించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సుప్రీం న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ అత్యవసర విచారణ చేపట్టింది. ముగ్గురు సభ్యులు గల ఈ బెంచ్‌లో జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు.ఈ విషయంపై విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్20ఏళ్ల తన సేవకు గుర్తింపు ఇదేనా?.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ...ఇది నమ్మశక్యంగా లేదు. ఈ ఆరోపణలను ఖండించడానికి నన్ను నేను ఇంత తగ్గించుకోవాల్సి వస్తుందని ఊహించలేదు.అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నారు. దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని స్తంభింపచేయాని వారు చూస్తున్నారు.అని ఆయన పేర్కొన్నారు. తాను జడ్జీగా 20 ఏళ్లు పనిచేశాననీ, తన బ్యాంకు బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఉండగా, పీఎఫ్ సొమ్ము రూ.40 లక్షలు మాత్రమే ఉందని గొగోయ్ తెలిపారు. ‘డబ్బు విషయంలో తనను దెబ్బకొట్టలేని కొన్ని శక్తులు ఈ ఆరోపణలు చేయిస్తున్నాయి. ఇప్పుడు భారత న్యాయవ్యవస్థ చాలా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది.న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నాపై వచ్చిన ఆరోపణల వెనుక చాలా బలీయమైన శక్తులు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళకు గతంలో నేరచరిత్ర ఉందని జస్టిస్ గొగోయ్ ఆరోపించారు. తాను దీనిపై ఎలాంటి తీర్పులూ వెలువరించబోననీ.. సీనియర్ న్యాయమూర్తి అరుణ్ మిశ్రా తీర్పు చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Related Posts