YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడారంలో ఆధునిక గుడారాలు!

మేడారంలో ఆధునిక గుడారాలు!

 మేడారంలో ఆధునిక గుడారాలు!

పర్యాటక శాఖ మేడారంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భక్తులు విడిది చేయడానికి ఆధునిక గుడారాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం మేడారంలో 46 ఆధునిక గుడారాల కోసం ప్లాట్‌ఫారాల నిర్మాణాన్ని చేపట్టింది. కుటుంబాలతో మేడా రం చేరుకునే భక్తులు చాలామంది ఇక్కడ క్లాత్ టెంట్లు, ప్లాస్టిక్ కవర్లతో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు.
సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న తర్వాత మేడారం నుంచి తిరుగుముఖం పడుతారు. తాము విడిది చేయడానికి మేడారంలో సరైన వసతులు లేవని సంపన్నులు అం టున్నారు. సంపన్నుల ప్రతిపాదనలను పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో మేడారంలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తోపాటు ఆధునిక గుడారాల నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం రూ.80లక్షలు మంజూరు చేసింది.

ఈ నిధులతో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తోపాటు ఆధునిక గుడారాల కోసం 46 ప్లాట్‌ఫామ్స్ నిర్మించే బాధ్యతలను పర్యాటక శాఖ అధికారులు గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. ట్రైబల్ మ్యూజియం పక్కన ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో ఆధునిక గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు బెడ్లు, టాయిలెట్ ఉండేలా 16x16 సైజుతో 46 ప్లాట్‌ఫామ్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు వీటిలో 38 ప్లాట్‌ఫామ్స్ పనులు పూర్తయినట్టు గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఏటూరునాగారం ఈఈ కోటిరెడ్డి చెప్పారు. ఈనెల 20నుంచి 38 ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వస్తాయన్నారు.
వీటిపై లగ్జరీ టెంట్లు, బెడ్స్, ఫర్నిచర్ వేసి భక్తులకు అద్దె ప్రాతిపదికన కేటాయించే బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నట్టు కోటిరెడ్డి వెల్లడించారు. నిర్వహణ చేపట్టిన సంస్థ ఈ ఆధునిక గుడారాల అద్దె ఖరారు చేయనుంది. గంటలు, రోజుల లెక్కన అద్దె పద్ధతిపై కేటాయించనుంది. పర్యాటక శాఖ పర్యవేక్షణలో ప్రైవేట్ సంస్థ ఈ లగ్జరీ గుడారాలు నిర్వహించనుంది. తమకు ఎన్ని గంటలు అవసరమనుకుంటే ఆ మేరకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది. మేడారంలో ఆధునిక గుడారాల నిర్మాణం చేపట్టడం సమ్మక్కసారలమ్మ జాతర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

Related Posts