Highlights
- అన్షు ప్రకాశ్ సీఎంకు ఓ లేఖ
బడ్జెట్ సమావేశాలపై చర్చించాల్సి ఉంది. అయితే తనతోపాటు ఇతర అధికారులపై చేయి చేసుకోమని హామీ ఇస్తేనే వస్తానని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ సీఎంకు ఓ లేఖ రాశారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ డేట్లను ఫైనలైజ్ చేయడానికి ఈ సమావేశం నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో సీఎస్ చెప్పారు.
సీఎస్ అన్షు ప్రకాశ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చేయి చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు అదే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన మరోసారి సమావేశం కావాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలపై చర్చించాల్సి ఉంది. అయితే తనతోపాటు ఇతర అధికారులపై చేయి చేసుకోమని హామీ ఇస్తేనే వస్తానని అన్షు ప్రకాశ్ సీఎంకు ఓ లేఖ రాశారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ డేట్లను ఫైనలైజ్ చేయడానికి ఈ సమావేశం నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో సీఎస్ చెప్పారు. ఢిల్లీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాలన సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాలతోనే అది సాధ్యం. అందుకే దానికి సంబంధించిన తేదీలు ఫైనల్ చేయడానికి నేను, మా ఇతర అధికారులు సమావేశానికి వస్తున్నాం. అయితే మాపై ఎలాంటి దాడి జరగదని సీఎం హామీ ఇస్తేనే వస్తాం అని సీఎస్ అన్షు ప్రకాశ్ ఆ లేఖలో స్పష్టంచేశారు. సమావేశం సజావుగా, హుందాగా సాగాలని కూడా ఆయన చెప్పారు. ఈ నెల 19న కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో తనపై దాడి జరిగిందని అన్షు ప్రకాశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు.