యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఆదివారం రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో చెన్నైని ఓడించింది. పార్థివ్ పటేల్ (53; 37 బంతుల్లో 2×4, 4×6) రాణించడంతో మొదట బెంగళూరు 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. దీపక్ చాహర్ (2/25), జడేజా (2/29) ఆ జట్టును కట్టడి చేశారు. స్టెయిన్ (2/29), ఉమేశ్ (2/47), సైని (1/24) ధాటికి తడబడిన చెన్నై.. ఛేదనలో 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. అద్భుతంగా పోరాడిన కెప్టెన్ ధోని (84 నాటౌట్; 48 బంతుల్లో 5×4, 7×6) చెన్నైని దాదాపుగా గెలిపించినంత పనిచేశాడు. చివరి బంతికి ఒక్క పరుగూ రాకపోవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.