YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్, కేజ్రీవాల్ కటీఫ్

రాహుల్, కేజ్రీవాల్ కటీఫ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అంతా అనుకున్నట్లే అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరేటట్లు కన్పించడం లేదు. రెండు పార్టీలు భీష్మించుకుని కూర్చోవడంతో ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్న త్రిముఖ పోటీ ఎవరికి లాభమన్న చర్చ జరుగుతోంది. చివరి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకుంటాయనే భావించారు. భారతీయ జనతా పార్టీ సయితం రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందేమోనన్న ఆందోళన చెందింది.అయితే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సంకేతాలు ఇవ్వడంతో పొత్తు ఇక లేనట్లేనని తేలిపోయింది. తొలుత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కు ఐదు స్థానాలు, కాంగ్రెస్ కు రెండు స్థానాలు ఇచ్చేందుకు ప్రతిపాదన ముందుంచారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సంఖ్యను అంగీకరించలేదు. అరవింద్ కేజ్రీవాల్ కావాలనే పొత్తుకు దూరమవుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ ఒక ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం కాంగ్రెస్ కు మూడు స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీకి సంకేతాలు పంపింది. అయితే దీనికి అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించలేదు. నాలుగు స్థానాల్లో ఢిల్లీలో తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు హర్యనా, ఛండీఘడ్ లో కూడా ఉండాలని ప్రతిపాదనలను పంపింది. అయితే కాంగ్రెస్ కు ఈ ప్రతిపాదన రుచించలేదు.హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్దగా బలంలేదు. హర్యానాలో మొత్తం పది పార్లమెంటు నియోజకవర్గాలుండగా, ఛండీఘడ్ లో ఒకే ఒక్క పార్లమెంటు స్థానం ఉంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీకి ఉన్న బలం హర్యానాలో లేదు. ఈ విషయాన్ని గుర్తించిక కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పొత్తుకు అవరోధాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అందుకే షీలాదీక్షిత్ ఒకటి రెండు రోజుల్లో ఏడు పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని సంకేతాలు ఇచ్చారు. త్రిముఖ పోటీలో ఢిల్లీలో బీజేపీ లాభపడటం ఖాయంగా కన్పిస్తుంది

Related Posts