యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:
నిన్న జరిగిన హైదరాబాద్-కోల్ కతా మ్యాచ్ సందర్భంగా యాంకర్ ప్రశాంతి రచ్చరచ్చ చేసింది. తన స్నేహితులులతో కలసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది. ఈ సందర్భంగా తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలా వారు ప్రవర్తించారు. సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యకరంగా ప్రవర్తించింది. వీరు చేష్టలతో అసహనానికి లోనైన ఓ వీక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.