యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర రాజకీయాలలో మార్పు తేవాలనే తపన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ది. ప్రజలకు సేవా చేయాలనుకున్న సామాన్యులకు సీట్లు ఇచ్చారని జనసేన నేత మాదాసు గంగాధర్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. పోటీ చేసిన యువత తో ఆదివారం పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రచారంలో అనుభవాలు, ప్రజల స్పందన గురించి వారు వివరించారు. ఎన్నికల ఫలితాల తో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండాలని పవన్ సూచించారని అయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఫలితాలు వచ్చే వరకు మేము వేచి చూస్తాం. ఇతర పార్టీల తరహాలో మాకు ఎటువంటి ఆందోళనలు లేవు. ప్రజల తీర్పు వెలువడ్డాకే మా పార్టీ స్పందన ఉంటుంది. త్వరలో ఉత్తరాంధ్ర లో పవన్ పర్యటిస్తారు. ఎవరెవరో మొరుగుతా ఉంటారు.. అన్నింటి కీ మేము స్పందించం. ఎన్నికల తర్వాత జనసేన ఉండదన్నారు.. వచ్చే ఎన్నికలకు మేము సిద్దమవుతున్నాం. ఈ ఎన్నికలలో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. మాకు సైలెంట్ ఓటింగ్ వచ్చింది..అది ఎంత అనేది మే 23న తెలుస్తుంది. మా అధినేత మంచి రాజకీయాలు చేయడమే నేర్పారు. మార్పు కోసం పవన్ చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు అందించాలని కోరుతున్నామని అయన అన్నారు.