యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలకు పూర్తి బాధ్యత వహిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్ వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారతీయ విద్యార్ధి సంఘం డిమండ్ చేఇంది. అసమర్ధ ఇంటర్ బోర్డ్ అధికారులను తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా పెయిల్ లైన విద్యార్థులకు, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు ఉచితంగా పేపర్ రివాల్యూవేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల,వి ద్యార్థుల, తల్లిదండ్రులతో చెలగాటం ఆడుతున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి. వెంకటేశ్వర రావు కమిటీ మూడు రోజులలో వెలువరించే నివేదికను బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేసింది. నిరసనకు దిగిన విద్యార్ధి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి బేగంబజార్ పీస్ కు తరలించారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థి నాయకులు సొమ్మసిల్లి పడిపోయారు.