బేతంచర్ల: లక్షలాది రూపాయలు నిధులతో మించిన భవనము అధికారుల నిర్లక్ష్యపు మాటను వృధాగా మిగులుతుంది ఉపాధి హామీ కార్మికులకు। అధికారులకు సేవలందించాల్సిన భవనం చెట్ల పొదలో నిరుపయోగంగా మారింది బేతంచర్ల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనక వైపు 2015 సంవత్సరంలో 32 లక్షలతో రూపాయలతో శ్రీ శక్తి భవనాలను ఉపాధి హామీ భవనాలను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి నిధులతో నిర్మించారు ఈ భవనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది ఈ శక్తి భవనంలో అధికారిక కార్యకలాపాలు ప్రారంభమైనవి ఉపాధిహామీ భవనంలో ఎటువంటి కార్యకలాపాలకు నోచుకోక వృధాగా వదిలేశారు అప్పటినుండి కార్యాలయ భాగంలో గడ్డివాములు కట్టెలు ఉంచటంతో ముళ్ళ పొదలు మధ్య వృధాగా మిగిలిపోయింది ఉపాధి హామీ శాఖ అధికారులు మండల పరిషత్ కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించుచున్నది సొంత భవనం ఉన్నప్పటికీ అరకొర వసతుల మధ్య ఎంపీడీవో కార్యాలయంలో నిధులు నిర్వహిస్తున్నది అక్షరాలు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న భవనం వృధాగా ఉంచడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి 2015 నుండి 2019 వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ కార్యకలాపాలు నిర్వహించడం పట్ల మండల అధికారి ఎన్ ఆర్ జి ఎస్ అధికారికి ఏమైనా లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా ఏమో అని పలురకాల విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా మండల అధికారులు పై అధికారులు రాజకీయ నాయకులు స్పందించి తమ తమ కార్యాలయాల్లో విధులు నిర్వహించాలి చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ కార్మికులు ప్రజా సంఘాల నాయకులు మండల ప్రజలు కోరుతున్నారు