యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మద్యపానం హానికరం,మద్యం సేవించవద్దు,మద్యం సేవించి వాహనాలు నడపవద్దు,ఇలాంటి ప్రచారాలు నిత్యం చూడటం వినటం మాములే.ప్రచార సాధనలో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వినిపిస్తూనే ఉంటాయి.ఇవేవీ మా చెవులకెక్కవు.కిక్కు కావాలి అంతే... అంతేగా... ఎప్పుడు తెల్లవారుతుందా మందేసి చిందేస్థా... మంటూ మద్యం దుకాణాలవద్ద ఉదయాన్నే దుకాణం తెరవకున్న పడిగాపులు కాస్తున్నారు మందు బాబులు.మందు బాబులనుఅసరాగా తీసుకొని మద్యం వ్యాపారులు ఏకంగా క్వాటర్ .10,బీరుకు 20 బహిరంగంగా దోచుకుంటున్నారు.ప్రశ్నించే వారికి సమాధానమిస్తూ,నెల,నెల సంబంధించిన ఆ శా అధికారులకు మందు బాటిళ్లతో పాటు మంచి, చెడ్డ చూసొకోవాలి,ఇవన్నీ చూడాలంటే అధికదరలకు విక్రయిస్తేనే గిట్టుబాటు అవుతుందని కరా కండిగా. చేప్పేస్తున్నారు.మరోవైపు మద్యం దుకాణాలు బార్ల తలపిస్తున్న అధికారులకు మాత్రం కనపడవు,వారి దృష్టికి రావు.తూ, తూ మంత్రంగా తనిఖీలు.అధికంగా రాజకీయ నాయకుల అనుచరులవే కావడంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు.తనిఖీలు చేయకపోతే ఒకటి,చేస్తే నాయకుల నుంచి ఫోన్లు చేసేది ఏమిలేక అధికారులు మిన్నకుండి పోతున్నారు.నంద్యాలలో మంచి నీళ్ళు దొరకక పోయిన మద్యం పుష్కలంగా దొరుకుతుంది.కనీసం అధికారులు తనిఖీలు చేయక పోయిన మద్యం ధరల దోపిడీని నివారించాలని మద్యం బాబులు కోరుతున్నారు.నాణ్యతలేని తినుబండారాల పైదృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.