YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ నామినేషన్ సరిగ్గానే ఉంది

రాహుల్ నామినేషన్ సరిగ్గానే ఉంది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దాఖలు చేసిన అఫిడవిట్‌, నామినేషన్‌ పత్రాలు సరియైనవే అని అమేథి రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్‌లో పొందుపరిచిన అంశాలన్నీ సరిగ్గానే ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారి రామ్‌ మనోహర్‌ మిశ్రా వెల్లడించారు. అమేథిలో రాహుల్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమైన విషయం విదితమే. బ్రిటన్‌లో రిజిస్టర్‌ అయిన కంపెనీ ప్రకారం.. రాహుల్‌కు ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తున్నది, అంటే ఈ దేశంలో రాహుల్‌ పౌరుడు కాదని, అందుకే ఆయన ఎన్నికలకు అనర్హుడు అంటూ న్యాయవాది రవిప్రకాశ్‌ ఆరోపించారు. రాహుల్‌ సమర్పించిన విద్యార్హత పత్రాల్లోనూ అనేక తప్పులున్నాయని, ఒరిజినల విద్యా పత్రాలను సమర్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
ఈ నేప‌థ్యంలో ఇవాళ రాహుల్ త‌ర‌పు న్యాయ‌వాది కౌశిక్‌.. కాంగ్రెస్ నేత విద్యార్హత‌ల‌ను వెల్ల‌డించారు. రాహుల్ ఎంఫిల్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రాహుల్ ఇండియాలోనే పుట్టార‌ని, ఆయ‌న‌కు ఇండియ‌న్ పాస్‌పోర్ట్ ఉంద‌ని, మ‌రో దేశంలో పాస్‌పోర్ట్ లేద‌ని, రాహుల్ పాస్‌పోర్ట్‌, ఓట‌ర్ ఐడీ, ఇన్‌కంట్యాక్స్‌, అన్నీ ఇండియాకి చెందిన‌వే అని న్యాయ‌వాది కౌశిక్ తెలిపారు. చివ‌ర‌కు అమేథీ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ రాహుల్ గాంధీ నామినేష‌న్ స‌రిగ్గానే ఉంద‌ని ఇవాళ ప్ర‌క‌టించారు.

Related Posts