YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజా వేదికలో సమీక్షలేంటి... ఈసీకి విజయసాయి లేఖ

ప్రజా వేదికలో సమీక్షలేంటి... ఈసీకి విజయసాయి లేఖ
ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు... 25 మంది లోక్‌సభ అభ్యర్థులతో సమావేశం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళిపై అభ్యర్థులతో చర్చించనున్నారు. జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించే అవకాశముంది. ఇదేంటి చంద్రబాబు సమీక్ష చేస్తే వైసీపీ ఎంపీ విజయసాయికి వచ్చిన ఇబ్బంది ఏంటని అనుకుంటున్నారా.. అక్కడే ఉంది చిన్న ట్విస్ట్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో.. ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారన్నది విజయసాయి అభ్యంతరమట. అందుకే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే.. చంద్రబాబు దానిని ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రజా వేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవన సముదాయం.. దీనిని పార్టీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులైన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను పార్టీ అవసరాలకి ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి.. ఈ సమావేశాలు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలంటున్నారు. ఆ సదుపాయాలను ఉపయోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా? లేదా..? తెలియజేయమంటున్నారు. ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై సమీక్షించి సీఎస్ ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు

Related Posts