
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడైన ఆటతీరుతో అదరగొడుతోంది. రిషభ్ పంత్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 నాటౌట్), ధవన్ (27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) అద్భుత హాఫ్ సెంచరీలతో రాజస్థాన్ రాయల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా 14 పాయింట్లతో పట్టికలో నెంబర్‌వన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. రహానె (63 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 నాటౌట్) అజేయ శతకం సాధించగా స్టీవ్ స్మిత్ (32 బంతుల్లో 8 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. రబాడకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి నెగ్గింది. పృథ్వీ షా (42) రాణించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా పంత్ నిలిచాడు.