Highlights
- రేపు ఉదయం 9 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీ క్లబ్‌కు తరలింపు
- మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యేక పూజ
- మధ్యాహ్నం 3 .30 గంటలకు విలే పార్లే హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు
అందాల రాశి శ్రీదేవి భౌతిక కాయం మంగళవారం రాత్రి ముంబై ఛత్రపతి విమానశ్రయానికి చేరుకుంది. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె భౌతికకాయాన్ని ముంబైకి తీసుకొచ్చారు. శ్రీదేవి మృతదేహాం వెంట బోనీకపూర్, ఖుషీ కపూర్‌లు ఉన్నారు. ముంబై ఎయుర్‌పోర్ట్‌కు శ్రీదేవి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.
రేపు ఉదయం 9 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీ క్లబ్‌కు శ్రీదేవి పార్థీవదేహన్ని తరలించనున్నారు. ఉదయం తొమ్మిదన్నర నుంచి మధ్యాహ్నం పన్నెడున్నర వరకు అభిమానుల సందర్శనకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం పన్నెడున్నర నుంచి ఒకటింటి వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. అనంతరం రెండు గంటలకు అంతిమయాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మూడున్నరకు విలే పార్లే హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్.. శ్రీదేవి మృతిపై విచారణను ముగించి అనంతరం ఆమె మృతదేహాన్నిభర్త బోనీకపూర్‌కు అప్పగించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపామని, ఆమె మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పృహ కోల్పోయి టబ్‌లో పడిపోవటం వల్లే శ్రీదేవి మరణించిందని, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని, బోనీకపూర్ ముంబై వెళ్లవచ్చని దుబాయ్ ప్రభుత్వం పేర్కొంది.