యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
2015 లో కేంద్ర మంత్రి హోదాలో శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ కి శంకుస్థాపన చేశాను. ఇప్పుడు ఉప రాష్ట్రపతి గా మొదటి స్నాతకోత్సవం కు రావడం ఆనందం గా ఉంది. పీపీపీ మోడల్ లో నిర్మిత మైన ఈ ట్రిపుల్ ఐటీ ద్వారా విద్యార్థులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం అయన శ్రీసిటీ ట్రిపుల్ ఐటి మొదటి స్నాతకోత్సవం కు ముఖ్య అతిథిగా హజరయ్యారు. వెంకయ్య మాట్లాడుతూ 100 పరిశ్రమల హబ్ అయిన శ్రీ సిటీ ఆధ్వర్యం లో ఈ ట్రిపుల్ ఐటీ నడవడం గొప్ప విషయం. వచ్చే పది పది హేను ఏళ్లల్లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా , ప్రపంచంలో 3 వ అతి పెద్ద ఎకానమీ గా భారత్ ఎదగనుంది. దేశ వ్యాప్తంగా 65 శాతం మంది 35 ఏళ్లలో పు వారు కావడం మన బలమని అన్నారు. మన దేశ సంస్కృతి షేరింగ్ అండ్ కేరింగ్. హుయత్సాంగ్ లాంటి విదేశీ చరిత్రకారులు మన దేశ గొప్పదనం గురించి వ్రాశారని గుర్తు చేసారు. ఒకప్పుడు మన దేశమే విద్యారంగంలో మేటి. నేడు దేశం లో 900 విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచం లో టాప్ 200 యూనివర్సిటీ ల్లో భారత్ ప్రాతినిధ్యం లేదు. విశ్వ విద్యాలయాల సంఖ్య పెంచడం మంచిదే..కానీ అదే స్థాయిలో విద్యా రంగం లో నాణ్యత పెరగాలని అయన అన్నారు. దేశం లో ఎన్నికల వేళ ప్రజలకు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే తాయిలాలు ఇస్తున్నారు..ఇది మంచిది కాదు..ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా హామీలు ఉండాలని అన్నారు. దేశానికి కావల్సింది తాత్కాలిక హామీలు కాదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా రాజకీయాలు మారాలి. రైతులకు కావల్సింది 12 గంటల నాణ్యత ఉన్న విద్యుత్తు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్ళు గడిచినా నేటికీ 21 శాతం ప్రజలు పేదరికంలో, 22 శాతం నిరక్షరాస్యులు గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలని అన్నారు. ప్రజలు స్వయం గా అభివృధి సాధించాలి. అ అవకాశాలను కల్పించేలా పాలకులు చేయాలి. విద్యార్థులు పాశ్చాత్య సంస్కృతిని, జంక్ ఫుడ్ ఆహారపు అలవాట్లను మార్చుకుని మన పెద్దలు తినే ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. లేటెస్ట్ స్కిల్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, ఫింటెక్ లాంటి స్కిల్స్ నేర్చుకుని మంచి ఉద్యోగాలు పొందాలి. దేశ, సామాజిక, తలిదండ్రుల సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ,హైదరాబాద్ త్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణ్, శ్రీసిటీ పరిశ్రమల ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ మొదటి స్నాతకోత్సవం లో 2017, 2018 బ్యాచ్ ల సీఎస్, ఈసీఈ కోర్సులలో ఉత్తీర్ణత పొందిన 136 మంది విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను, ఉపరాష్ట్రపతి అందచేశారు. హర్షిత, ఐశ్వర్య రాయ్, కృతి కరణ్, సంతోషిణి రెడ్డి లకు గోల్డ్ మెడల్స్ ను అందించారు. అనంతరం విద్యార్థులు తో కలలిసి ఉపరాష్ట్రపతి ఫోటో దిగారు. అనంతరం, ఉపరాష్ట్రపతి తడ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు లో చెన్నై వెళ్లారు.