YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెరిగిన పోలింగ్ శాతం

పెరిగిన పోలింగ్ శాతం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ తో ఓటు హక్కు వినియోగించుకోవడంతో జిల్లా ప్రజలు అందరికి ఆదర్శంగా నిలిచారు.  ఈ ఎన్నికల్లో 31,72,413 మంది మెత్తం  ఓటర్లకు గాను24,65,903 మంది ఓటు హక్కును వినియోగించుకుని 77.73  శాతం సాధించారు. ఈ వివరాలను జిల్లా ఎన్నికల అధికారి , జిల్లా కలెక్టర్ యస్.సత్యనారాయణ మంగళవారం  తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 73.86 శాతం తో ఓటింగ్ జరుగగా, ప్రస్తుత ఎన్నికల్లో 77.73 శాతం సాధించాం  అంటే ఈ ఎన్నికల్లో 3.87 ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క బనగానపల్లె నియోజకవర్గం మినహా మిగిలిన 13 నియోజకవర్టాలలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందన్నారు. ఇందులో నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలొ 2014 లో 78.3 శాతం ఓటింగ్ జరుగగా 2019  లో 86.90 శాతం తో ముందంజలో నిలిచిందన్నారు. అత్యల్పంగా ఆదోని నియోజకవర్గంలో 0.03 శాతం మాత్రమే పెరుగుదల కనిపించిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల వారిగా ఓటింగ్ శాతం పెరుగుదలను గమనిస్తే కర్నూలు జిల్లా 3.87 శాతం పెరెగుదలతో ద్వితీయ స్ధానంలో నిలిచింది. మహిళా ఓటర్లు ప్రజాస్వామ్య పండుగాలో భాగస్వామేలై ఓటింగ్ నమెదులో 4.41 శాతం పెంచి రాష్ట్రలోనే జిల్లా ను ప్రధన స్ధానంలో నిలిపి అందరికి స్పూర్తి అందించారు. 2014 ఎన్నికలలో 72.76 శాతం ఓటింగ్ నమెదుకాగా ప్రస్తుత ఎన్నికల్లో 77.17 శాతం ఓటింగ్ నమెదు చేసి 4.41 శాతం పెరుగుదలతో ముందంజలో నిలిచారు.
జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగి పలు రికార్డులు సాధించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరంతరంగా సాగిన స్వీప్ కార్యక్రమం. స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఎన్నికల ప్రక్రియలో ఒటరు భగస్వామ్యం పేరుతో జిల్లా అంతటా నిసృత్త ప్రచారం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను చేపటారు. ఇందులో 99.442 మంది యువ ఓటర్లు ఉండటం ఇందుకు నిదర్శనం. మెత్తంగా జిల్లాలో 9.34 శాతం కొత్త ఒటరు పెరుగుదల జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతితో ఈ విషయం, వివిపాట్స్ లను వినియెగించి ఓటు వేయడం పై అవగాహన పెంచడంతో జిల్లాలో 73.23 శాతం ఓటింగ్ నమెదయ్యింది.  సత్యనారాయణ మాట్లాడుతూ  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు పలు అవగాహన కార్యక్రామాలు జరిపాం ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఓటు హక్కును నమెదుచేసుకోవడంతో పాటు ఓటింగ్ లో పాల్గొనడం, మహిళ ఓటర్లు స్పందించి ఓటింగ్లో పాల్గొనడం, ఓటర్ల లో వెల్లివిరిసిన చైతన్యంతో పెరిగిన ఓటింగ్ శాతం చాలా సంతోషాన్నిచ్చాయన్నారు.

Related Posts