యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ డే రోజు ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాయి. చర్చ్‌లు, హోటళ్లు టార్గెట్‌గా పేలుళ్లకు తెగబడ్డారు.. ఈ పేలుళ్లలో 300మందికిపైగా చనిపోగా.. వీరిలో 10మందికిపైగా భారతీయులు ఉన్నారు. సరదాగా వేసవి విడిది కోసం వెళ్లిన జేడీఎస్ నేతలు కూడా బలయ్యారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు కూడా చనిపోయాడు.. మరో ఇద్దరు తెలుగువారు గాయపడ్డారు. ఈ పేలుళ్ల ఘటన నుంచి వైసీపీ నేత, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ తృటిలో తప్పించుకున్నారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అమర్‌నాథ్ తెలిపారు. స్నేహితులతో కొలంబో పర్యటనకు వెళ్లిన ఆయన.. కింగ్స్‌జ్యూరీ హోటల్‌కు చెందిన ఫ్లాట్‌లో బసచేశారు. పేలుళ్ల సమయంలో కూడా ఫ్లాట్‌లోనే ఉన్నారట.. వారి పక్క అపార్ట్‌మెంట్‌లోనే పేలుళ్లు జరిగాయట. వాస్తవానికి సోమవారం రాత్రి కొలంబో నుంచి బయల్దేరాల్సి ఉన్నా.. పేలుళ్లు జరగ్గానే అమర్‌నాథ్ స్నేహితులు కలిసి విశాఖ వచ్చేందుకు ప్రయత్నించారు. ఎయిర్‌పోర్టులో కూడా బాంబులు పెట్టారని సమాచారంతో.. విమాన రాకపోకలు ఆగిపోయాయి. దీంతో సోమవారం ఉదయం ఫ్లైట్‌లో చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి విశాఖకు చేరుకున్నారు. ఆ భగవంతుని దయ, ప్రజల ఆశీస్సులే రక్షగా.. ఆ ఘటన నుంచి బయటపడ్డామన్నారు. క్షేమంగా విశాఖ చేరుకున్నామని ఫేస్‌బుక్‌లో అమర్ పోస్ట్ పెట్టారు.