YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

అందుబాటులోకి రిలయన్స్ గిగా సేవలు

అందుబాటులోకి రిలయన్స్ గిగా సేవలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమౌతోంది. గిగాఫైబర్‌తో బ్రాండ్‌బ్యాండ్ విభాగంలో దూసుకెళ్లాలని చూస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంటోంది. గిగాఫైబర్ కింద బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ అందించొచ్చని తెలిపింది. కంపెనీ ఇప్పటికే గిగాఫైబర్ సేవలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. న్యూఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. ఉచితంగానే నెలకు 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది. ఈ సేవలు పొందాలంటే రూటర్ కోసం రూ.4,500 వన్‌టైమ్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. కాగా రిలయన్స్ జియో తన గిగాఫైబర్ సర్వీస్‌ను 2018 ఆగస్ట్‌లోనే ప్రకటించింది. 
జియో గిగాఫైబర్‌తో ఎలాంటి సేవలు పొందొచ్చు.. 
✺ 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. 
✺ టెలీఫోన్, టెలివిజన్ సర్వీసులు వచ్చే మూడు నెలల కాలంలో గిగాఫైబర్‌తో అనుసంధానం కావొచ్చు.
ఈ తరహా కనెక్షన్లు ఆస్ట్రేలియా లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రిడ్ కొంత వరకు పనిచేస్తున్నది. లాండ్ లైన్ ఫోన్ కొన్ని చోట్ల మాత...+
✺ ఈ మూడు సర్వీసులు ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. 
✺ జియో స్మార్ట్‌ హోమ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వంటి 40 డివైస్‌లను కనెక్ట్ చేసుకునే ఆప్షన్ అందించొచ్చు. దీని కోసం రూ.1,000 చెల్లించాల్సి రావొచ్చు. 
రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 

Related Posts