YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా నష్టపోయింది. సెన్సెక్స్ 80 పాయింట్లు పడిపోయింది. 38,565 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 11,576 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దేశవ్యాప్తంగా మూడో మూడో దశ పోలింగ్‌ జరుగుతుండటంతో పాటు మరో రెండు రోజుల్లో(గురువారం) డెరివేటివ్స్‌ ముగింపు ఉండటం, యూరప్‌ మార్కెట్లు నష్టాల ప్రారంభం వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ 50లో ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, కోల్ ఇండియా, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ ఏకంగా 4 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో మారుతీ సుజకీ, యస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. మారుతీ, యస్ బ్యాంక్ షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో వంటి ఇండెక్స్‌లు నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి.

Related Posts