YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో కోవర్టులు...

టీడీపీలో కోవర్టులు...
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నేత‌ల‌తో జ‌రిపిన కీల‌క స‌మావేశంలోనే..,తెలుగుదేశం పార్టీకి `ద్రోహం` చేస్తున్న వారి గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. అంతేకాకుండా...వారి విష‌యంలో క‌ఠినంగా ఉంటాన‌ని తేల్చిచెప్పారు. వైసీపీతో చేతులు క‌లిపిన టీడీపీ నేత‌ల చిట్టా త‌న వద్ద ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో 175 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, 25 పార్లమెంట్‌ అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పోలింగ్‌ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహారశైలి, వైకాపా దాడులపై సమగ్రంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగానే చంద్ర‌బాబు కోవ‌ర్టుల వ్యాఖ్య‌లు చేశారు.రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్‌ స్థానాలవారీగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్‌ వివరాలను అభ్యర్థులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. అదే విధంగా నియోజకవర్గాలవారీగా తను సేకరించిన సమాచారాన్నికూడా వారికి అధినేత వివరించారు. కొన్ని నియోజకవర్గాల్లో 17-సి, 17-ఎం ఫారాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని సీఎం చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా తెలిపారు. త్వరలోనే పార్లమెంట్‌ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని ఈలోగా బూత్‌లవారీ ఎన్నికలు జరిగిన తీరు పోలింగ్‌ సరళిపై అధ్యయనం చేయాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా కోవ‌ర్టుల గురించి చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొందరు పార్టీలోనే ఉంటూ పరోక్షంగా వైకాపాకు సహకరించారని చంద్ర‌బాబు మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు తనవద్ద ఉన్నాయని, పార్టీకి ధ్రోహం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.కాగా, ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నికలు ఫలితాలు వచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని దీనికి అందరు సర్వసన్నద్దంగా ఉండాలని పార్టీ నేత‌ల‌కు చంద్ర‌బాబు స్పష్టం చేశారు. కౌంటింగ్‌ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లతోపాటు, నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత మనపై ఉందని వారికి సూచించారు. గంటలతరబడి క్యూలైన్‌లో ఉండి ఓట్లు వేసినవారందరికి కృతజ్ఞతలు తెలపాలని నియోజకవర్గాలవారీగా మంగళవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్పష్టం చేశారు.ఎన్నిక‌ల‌ను స‌మ‌గ్రంగా స‌మీక్షించిన చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా చేసిన కోవ‌ర్టు వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. సీఎం చంద్ర‌బాబు గుర్తించిన ఈ కోవ‌ర్టులు ఎవ‌రు? వారు పార్టీకి చేసిన ద్రోహం ఏంటి? అలాంటి నేత‌ల‌పై ఏం చ‌ర్య‌లు ఉండ‌నున్నాయ‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీంతోపాటుగా, ఈ కోవ‌ర్టుల‌ మూలంగా జ‌రిగిన న‌ష్టం గురించి స‌హ‌జంగానే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

Related Posts