YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వారణాసిలో 400 మందికి పైగా పోటీ

 వారణాసిలో 400 మందికి పైగా పోటీ
ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గం ఈ సారి హాట్ టాపిక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. చివరి విడత ఎన్నికల్లో ఈ స్థానం పోలింగ్ జరగనుంది. ఇక్కడ్నుంచి ప్రధాని మోడీ.. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ తరపున ప్రియాంకగాంధీ పోటీ చేసే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు..ఎస్పీ, బీఎస్పీ సహా.. అన్ని మిత్రపక్షాలు మద్దతిస్తాయన్న సమాచారం కూడా ఉంది. అయితే… ఈ లోపే… మోడీ పాలనకు వ్యతిరేకంగా… రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ రైతులు ఉత్తరాది రైతులు కాదు. దక్షిణాది వాళ్లే. ఇప్పటికే… వారణాశి నుంచి పోటీ చేయడానికి తమిళనాడు నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కొన్నాళ్లుగా తమిళనాడు రైతాంగానికి కేంద్రం సాయం చేయాలంటూ..రైతులు ఢిల్లీలో ఆందోళన చేశారు. అయితే కేంద్రం పట్టించుకోలేదు. దానికి నిరసనగా… తమిళనాడు రైతులు..వారణాశిలో మోడీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి బాటలోనే… తాజాగా తెలంగాణ రైతులు కూడా..నడవాలని డిసైడయ్యారు. పసుపుబోర్డు ఏర్పాటును డిమాండ్ చేస్తూ.. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిజామాబాద్ రైతులు నిర్ణయించారు. పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం ప్రారంభించారు. రైల్లో వారణాశికి చేరుకుని స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌లు వేయనున్నారు. పసుపు రైతులు..నిజామాబాద్ లోక్ సభ స్థానంలోనూ పెద్ద ఎత్తున బరిలో నిలిచారు. 185 మంది అభ్యర్థులు పోటీ పడటంతో… పోలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడు రైతులతో కలిసి నామినేషన్లు వేస్తామని.. ఇతర రాష్ట్రాల రైతుల్ని కూడా..మోడీపై పోటీకి ఆహ్వానిస్తామని నిజామాబాద్ రైతులు అంటున్నారు. మొత్తానికి వారణశిలో.. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైతే… బ్యాలెట్ ఓటింగ్ జరగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 185 మంది బరిలో ఉంటే.. ఈవీఎంలు కొన్ని వేలు వాడాల్సి వచ్చింది. ఈ సారి.. వారణాశిలో నాలుగైదు వందల మంది బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts